News July 8, 2024
ఏర్పేడు: 12న IISERలో కాన్వొకేషన్

ఏర్పేడు మండలం శ్రీనివాసపురం వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)నందు 12వ తేదీన ఐదో కాన్వొకేషన్ వేడుకను నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని కోరారు.
Similar News
News October 28, 2025
కుప్పంకు భారీ పరిశ్రమలు… 22 వేలు మందికి ఉద్యోగాలు…!

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం పారిశ్రామిక వాడగా మారనుంది. నేడు వర్చువల్ గా నిర్వహించాల్సిన శంకుస్థాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. AELAP, ACE, E-ROYCE, ఆదిత్య బిర్లా గ్రూప్స్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో పాటుగా మదర్ డెయిరీ, శ్రీజ డెయిరీ 2027 నాటికి పూర్తి అవుతాయి. కంపెనీలు అందుబాటులోకి రాగానే ప్రత్యక్షంగా 22 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం.
News October 28, 2025
ఐరాల: ప్రమాదకరంగా రాకపోకలు

ఐరాల మండలంలోని ఉప్పరపల్లె గ్రామస్థులు నీవా నదిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతపేట వద్ద ఇటీవల తాత్కాలికంగా నదిపై దారి ఏర్పాటు చేసుకున్నారు. వర్షాల నేపథ్యంలో దారి కొట్టుకుపోయింది. దీనిపై ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
News October 28, 2025
చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.


