News February 14, 2025
ఏర్పేడు: JRFకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ -02 (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఐదు సంవత్సరాల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in వెబ్ సైట్ చూడాని పేర్కొంది.
Similar News
News February 24, 2026
ఏఐ సమ్మిట్‌లో నిరసన.. యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో <<19209641>>చొక్కాలు విప్పి<<>> నిరసన తెలిపిన కేసులో యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 15 గంటలపాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుని ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన విచారణకు సహకరించలేదని, తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టయ్యారు.
News February 24, 2026
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం ఎలా ఉందంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట్ 17.8మి.మీ, తాడ్వాయి 13, ఆర్గొండ 12, రామలక్ష్మణపల్లి 11.3, లచ్చపేట 9.3, పాత రాజంపేట 7.8, దోమకొండ 7.3, భిక్కనూరు 5, జుక్కల్ 4.8, రామారెడ్డి 2.3 మి.మీ ల అత్యధిక వర్షపాతం నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత భిక్కనూరు 21.8°C, కాగా అత్యల్ప ఉష్ణోగ్రత మేనూరు 17.4°C లో రికార్డు అయ్యాయి.
News February 24, 2026
KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్!

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.


