News October 11, 2024

ఏర్పేడు: Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 2024-25 విద్యా సంవత్సరానికి Ph.Dలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్స్, హ్యుమానిటీస్& సోషల్ సైన్స్ విభాగాలలో అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. చివరి తేదీ నవంబర్ 03.

Similar News

News November 7, 2025

కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

image

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్‌గా CM చంద్రబాబు శంకుస్థాపన.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.