News March 2, 2025
ఏలూరును ఉలిక్కిపడేలా చేసిన చిన్నపిల్లల విక్రయాలు

ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకువచ్చి విజయవాడ, ఏలూరు ప్రాంతాలలో అమ్మకాలు జరిపే ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ప్రకాష్ నగర్కు చెందిన సరోజినీ ఆధ్వర్యంలో ఒక ముఠా ఏలూరులో ముగ్గురు పిల్లలను అమ్మినట్లు తెలియటంతో పోలీసు బృందాలు చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆడ శిశువు రూ.3 లక్షలు, మగ శిశువుని రూ.5 లక్షలకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
Similar News
News October 15, 2025
విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.
News October 15, 2025
Way2News కథనంతో RO ప్లాంటుకు మోక్షం

ఇంకొల్లులోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వద్ద టాయిలెట్లో అమర్చిన RO ప్లాంటు నుంచి వచ్చే తాగునీటి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై ‘<<18006504>>టాయిలెట్లో ఆర్వో ప్లాంట్<<>>.. ఇదేం చోద్యం..!’ శీర్షికన మంగళవారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు బుధవారం ఆ ప్లాంట్ను అక్కడి నుంచి తొలగించి వేరే రూమ్కు మార్చారు. సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News October 15, 2025
కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి

కేరళ(కొచ్చి)లోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ PM రైలా ఒడింగా(80) గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్కు తరలించగా ఉ.9.52కు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై FRROకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా PMగా వ్యవహరించారు.