News March 2, 2025

ఏలూరును ఉలిక్కిపడేలా చేసిన చిన్నపిల్లల విక్రయాలు

image

ఇతర రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలను తీసుకువచ్చి విజయవాడ, ఏలూరు ప్రాంతాలలో అమ్మకాలు జరిపే ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ప్రకాష్ నగర్‌కు చెందిన సరోజినీ ఆధ్వర్యంలో ఒక ముఠా ఏలూరులో ముగ్గురు పిల్లలను అమ్మినట్లు తెలియటంతో పోలీసు బృందాలు చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆడ శిశువు రూ.3 లక్షలు, మగ శిశువుని రూ.5 లక్షలకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

Similar News

News July 8, 2025

VJA: కదంభ ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా?

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ జులై 8, 9, 10 తేదీల్లో శాకంబరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే కదంభ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈవో శీనా నాయక్ ప్రసాద పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

News July 8, 2025

అల్లూరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

అల్లూరి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. గడచిన 24గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. వరరామచంద్రపురంలో అధికంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ముంచంగిపుట్టు 16.4, హుకుంపేట 12.4, గూడెం కొత్తవీధి 10.2, జీ.మాడుగుల 8.6, చింతపల్లి 6.8, పెదబయలు 6.2, చింతూరు 6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందన్నారు. జిల్లాలో 255.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.