News April 5, 2025

ఏలూరులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి

image

ఏలూరులోని శ్రీరామ్ నగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి మూడురోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి  శివరామకృష్ణ (46)గా తెలుస్తుంది. గతంలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశాడని కాలనీవాసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

Similar News

News September 16, 2025

PDPL: నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5లక్షల- రూ.10 లక్షల వరకు జరిమానా

image

వైన్ షాపులు, బార్ల ఎదుట రోడ్లపై మద్యం సేవించడం శ్రేయస్కరం కాదని, ఇది సామాజిక అశాంతికి దారి తీస్తోందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. ప్రజల అసౌకర్యం, పారిశుద్ధ్య లోపం దృష్ట్యా ఇలాంటి చర్యలు నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో అబ్కారీశాఖ అధికారి మహిపాల్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

News September 16, 2025

బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

image

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

News September 16, 2025

ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.