News January 17, 2025
ఏలూరులో ఈనెల 22 జాబ్ మేళా

ఈనెల 22న ఏలూరులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధు భూషణరావు శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. తిరుపతిలో ఉన్న పశ్చిమ ఆసియాలో అతి పెద్ద క్యాడ్బరీ చాక్‌లెట్ తయారీ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 16, 2025
నిడమర్రులో యువకుడి దారుణ హత్య

ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మాది ఏసురాజు (26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే యువకుడి చేయి నరికేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి నిడమర్రు SI చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News February 16, 2025
ద్వారకాతిరుమల : వైసీపీ సీనియర్ నాయకుడు రాజబాబు మృతి

ద్వారకాతిరుమలలోని సీహెచ్ పోతే పల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన ఇటీవల బాత్రూంలో జారి పడటంతో కాలు విరిగింది. అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 16, 2025
చింతలపూడి: బాలికకు జీబీఎస్ లక్షణాలు..UPDATE

చింతలపూడిలోని యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ లక్షణాలు కనిపించగా..విజయవాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బాలిక నుంచి సీఎస్ఎఫ్ నమూనాలను తీసి తుది నిర్ధారణకు చెన్నైకు పంపినట్లు డీఎంహెచ్ వో, డీఈవో తెలిపారు. ఫలితాలు రావడానికి 2 వారాలు పడుతుందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందన్నారు. బాలిక స్వగ్రామంలో పలువురి నమూనాలను సేకరించగా ఎవరికీ లక్షణాలు లేవని పీహెచ్సీ వైద్యాధికారి నరేశ్ తెలిపారు.