News February 5, 2025
ఏలూరులో ఏసీబీ దాడులు..ఫుడ్ సేఫ్టీ అధికారిని అరెస్టు

ఏలూరు నగరంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం..ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి బుధవారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. అధికారితో పాటు ఆఫీసు సబార్డినేట్ పుల్లారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాధికారుల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ, అధికారులు ఉన్నారు.
Similar News
News December 7, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>
News December 7, 2025
నాగర్కర్నూల్లో స్వల్పంగా తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.


