News February 5, 2025
ఏలూరులో ఏసీబీ దాడులు..ఫుడ్ సేఫ్టీ అధికారిని అరెస్టు

ఏలూరు నగరంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం..ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి బుధవారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. అధికారితో పాటు ఆఫీసు సబార్డినేట్ పుల్లారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాధికారుల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ, అధికారులు ఉన్నారు.
Similar News
News March 7, 2026
మదనాపురం: రైల్వే గేట్ దగ్గర రాకపోకలు నిలుపుదల

మదనాపురం పట్టణంలోని వనపర్తి ఆత్మకూరు రైల్వే గేటు దగ్గర రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నందున 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల ఉంటుందన్నారు. కావున ప్రయాణికులు గమనించాలని ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News March 7, 2026
వనపర్తి విద్యారంగం భేష్: కలెక్టర్ ఆదర్శ్ సురభికి సీఎం ప్రశంసలు

వనపర్తి జిల్లా విద్యారంగంలో సత్తా చాటింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి నాయకత్వంలో పీఎం పోషణ్ అమలులో 95 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం, విద్యాశాఖ పనితీరు సూచికలో ద్వితీయ స్థానం సాధించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% గ్యాస్ కనెక్షన్లు కల్పించడం విశేషం. ఈ విజయాలపై ఇటీవల జరిగిన కలెక్టర్ల సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కలెక్టర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
News March 7, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన వైభవ్ మేనమామ

టాలెంటెడ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మేనమామ అభిషేక్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 102వ ర్యాంకు సాధించారు. దీంతో అల్లుడు క్రికెట్‌లో, మామ సివిల్స్‌లో అదరగొట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. 27 ఏళ్ల అభిషేక్ స్వస్థలం బిహార్‌లోని రాజజన్ గ్రామం. ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అతను 2022 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. అభిషేక్ తండ్రి అభయ్ నలంద ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్.


