News February 6, 2025

ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్

image

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.

Similar News

News December 9, 2025

కాకినాడ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

image

నేడు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, టోల్ ఫ్రీ 1064,14400 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.

News December 9, 2025

ఆసిఫాబాద్: ‘సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’

image

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సా.5 గంటలకు ముగుస్తుందని ASF జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. ‘పోలింగ్‌కు 44 గంటల ముందు నిశబ్ద వ్యవధి అమలులోకి రానుంది. ఈ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని అన్నారు.

News December 9, 2025

కేజీ నిమ్మ రూ.6.. రైతుల గగ్గోలు

image

AP: రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు.