News September 11, 2024
ఏలూరులో జాబ్ మేళా.. 77 మంది ఎంపిక
ఏలూరు ప్రభుత్వ డీఎల్ టీసీ, ఐటీఐ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు 224 మంది హాజరయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 77 మందిని అర్హులుగా గుర్తించి, వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఉగాది రావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి(ఒకేషనల్) వరలక్ష్మి, వై.పి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 10, 2024
ఉచిత ఇసుకతో భారీ దోపిడి: కారుమూరి
నిత్యవసరాలు సామాన్యులకు అందకుండా నియంత్రించలేని కూటమి ప్రభుత్వం సూపర్ బాదుడు కొనసాగిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తణుకు సజ్జాపురంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేరుతో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వరద నియంత్రణ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.
News October 10, 2024
ఏలూరు జిల్లాకు 3 టన్నుల రాయితీ టమాటాలు
ఏలూరు జిల్లాకు మూడు టన్నుల రాయితీ టమాటాలు దిగుమతి చేయడం జరిగిందని బుధవారం మార్కెటింగ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఏలూరు నగరంలోని పత్తేబాద రైతు బజారుకు 1.50 టన్నులు, ఒకటో పట్టణ రైతు బజారుకు 750 కిలోలు, కైకలూరు రైతు బజారుకు 500 కిలోలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. కిలో రూ.50 కి అమ్ముతారని, ప్రజలు గమనించాలని కోరారు.
News October 10, 2024
యర్నగూడెం జాతీయ రహదారిపై మంత్రి తనిఖీలు
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. యర్నగూడెం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద లోడుతో వెళుతున్న లారీలను ఆపి పత్రాలను పరిశీలించారు. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అక్రమాలపై దృష్టి సారించిన మంత్రి మనోహర్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.