News February 5, 2025

ఏలూరులో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

image

ఏలూరు నగర సమీపంలోని వంగూరు సివిల్ సప్లైస్ బఫర్ గోదాము, ఏలూరు మండల స్థాయి గోదాములను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాము ఇన్‌ఛార్జితో కలిసి రికార్డులను పరిశీలించారు. పేదలకు సంబంధించిన సరుకులను సకాలంలో పంపిణీ చేసేలా చూడాలన్నారు.  అవకతవకలకు పాల్పడినా, అక్రమాలు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

News February 18, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు

News February 18, 2025

కరీంనగర్‌లో విషాద ఘటన

image

కరీంనగర్‌లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్‌కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.

error: Content is protected !!