News August 17, 2024
ఏలూరులో దారుణం.. భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కూలి పనుల కోసం భర్తతో కలిసి వచ్చిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. రామకోటి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. భర్తకు మద్యం తాగించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. సహకరించకుంటే భర్తను చంపేస్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుపెట్టుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 14, 2024
ప.గో: వరద బాధితుల సహాయార్థం రూ.120 కోట్లు విరాళం
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంయుక్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.హరి కుమార్ తెలిపారు. శనివారం భీమవరంలో పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఏపీజేయూసీ ద్వారా విరాళాన్ని అందజేయనున్నట్లు వివరించారు. సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలిపారు. వీరా రావు, చిన్నయ్య పాల్గొన్నారు.
News September 14, 2024
పాలకొల్లు: ఆరు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య
పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రావూరి దేవి (23)ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దేవి ఆరు నెలల గర్భిణీ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉండిపోయారు. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 14, 2024
ఏలూరు: ముగిసిన వైసీపీ నేత అంత్యక్రియలు
కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.