News March 24, 2024

ఏలూరులో మంత్రి కొడుకు Vs మాజీ మంత్రి అల్లుడు

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.

Similar News

News October 30, 2025

తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వెయ్యాలి: కలెక్టర్

image

తుఫాను కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వెయ్యాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు పత్యేక శ్రద్ధ పెట్టాలి, తాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అనంతరం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News October 30, 2025

పంట వివరాలను 5రోజుల్లో నివేదిక ఇవ్వాలి: జేసీ

image

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News October 30, 2025

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం: కలెక్టర్

image

జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం అందజేయాలన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, కంది పప్పు, వంట నూనె, ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు.