News March 8, 2025
ఏలూరులో మంత్రి నాదెండ్ల పర్యటన

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్త్రీ, పురుషుల కోసం విశ్రాంతి బ్యారక్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం విశ్రాంతి బ్యారక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేశ్, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
GWL: ఎన్నికల బాధ్యతలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోడల్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారుల నిర్వహణపై ఆయన సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో ఎక్కువ మంది విద్యాశాఖ సిబ్బంది పాల్గొంటున్నందున, మ్యాన్ పవర్ నిర్వహణ బాధ్యతలను ఆ శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. బదిలీ అయిన సిబ్బందిని మినహాయించాలని ఆదేశించారు.
News November 26, 2025
పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు లభించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని జనవరి 2న ప్రదానం చేయనున్నారు.