News March 8, 2025

ఏలూరులో మంత్రి నాదెండ్ల పర్యటన

image

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్త్రీ, పురుషుల కోసం విశ్రాంతి బ్యారక్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం విశ్రాంతి బ్యారక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేశ్, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 14, 2026

నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

image

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News January 14, 2026

కామారెడ్డి: పండుగ పూట భగ్గుమన్న చికెన్ ధరలు

image

సంక్రాంతి వేళ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పండుగ డిమాండ్‌కు తోడు కోళ్ల దాణా ధరలు పెరగడంతో విక్రయదారులు ధరలను సవరించారు. బుధవారం మార్కెట్‌లో స్కిన్‌లెస్‌ చికెన్ కిలో రూ.310 చేరగా.. లైవ్ కోడి కిలో రూ.200 చొప్పున విక్రయించారు. చికెన్ ధరలు సామాన్యుడికి భారంగా మారగా, మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మార్కెట్‌లో కిలో మటన్ రూ.800 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.

News January 14, 2026

WGL: సూర్యభగవానుడి ఆశీస్సులే భోగి పండ్లు..!

image

సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు భోగి పండగను ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. భోగి మంటలతో చలిని తరిమికొట్టే వేడుక ఒకెత్తయితే, చిన్నారుల తలపై భోగి పండ్లు పోయడం ఈ పండగలోని మరో ప్రధాన ఘట్టం. రేగు పండ్లకు అర్కఫలం అనే విశిష్ఠమైన పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు.