News March 28, 2025

ఏలూరులో మహిళ దారుణ హత్య UPDATE

image

ఏలూరు నగరంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు కాళ్లు చేతులు కట్టేసి హతమార్చారిన విషయం తెలిసిందే. మెడలోని గొలుసు, ఉంగరాలు, కొంత బంగారాన్ని రూ.25 వేల నగదును అపహరించినట్లు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News December 1, 2025

WGL: చెక్ పవర్‌పై దృష్టి!

image

పంచాయతీ ఎన్నికల వేడి గ్రామాల్లో రగులుకుంది. సర్పంచ్‌గా గెలిచే ఛాన్సు లేని దగ్గర వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌గా చేయాలని చూస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ ఇచ్చారు. పంచాయతీ నిధుల విడుదల సమయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సైతం ప్రాధాన్యం ఉండడంతో, చెక్ పవర్ ఇచ్చే ఉప సర్పంచ్ పదవులకు సైతం డిమాండ్ ఎక్కువైంది.

News December 1, 2025

HYD: రాజ్ భవన్.. లోక్ భవన్‌గా మారనుందా?

image

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్‌భవన్‌గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లోని రాజ్‌భవన్‌లు లోక్‌భవన్‌గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్‌భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.

News December 1, 2025

2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.