News March 28, 2025
ఏలూరులో మహిళ దారుణ హత్య UPDATE

ఏలూరు నగరంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు కాళ్లు చేతులు కట్టేసి హతమార్చారిన విషయం తెలిసిందే. మెడలోని గొలుసు, ఉంగరాలు, కొంత బంగారాన్ని రూ.25 వేల నగదును అపహరించినట్లు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News April 19, 2025
అప్పుడూ.. ఇప్పుడూ ఒకే స్కోరు, ఒకే రిజల్ట్

చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో మ్యాచులో RCB ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది.
News April 19, 2025
విశాఖ కొత్త మేయర్ ఆయనేనా?

జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో కొత్త మేయర్ ఎవరన్న సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలో పలువురు ఆశావాహులు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ పదవికి అవిశ్వాసం జరిగితే ఆ పదవి జనసేనకు కేటాయిస్తారని కూటమి వర్గాల్లో చర్చనడుస్తోంది.
News April 19, 2025
వందేళ్ల వరకు భూ సమస్య లేని విధంగా భూభారతి: కలెక్టర్ గౌతం

వందేళ్ల వరకు భూసమస్యలు లేని విధంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ గౌతం తెలిపారు. శనివారం కేశవరంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూముల సమస్యలలో శాశ్వత పరిష్కారం భూభారతిలో జరుగుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, ఎమ్మార్వో వెంకటనరసింహారెడ్డి పాల్గొన్నారు.