News February 2, 2025

ఏలూరులో రేపటి గ్రీవెన్స్ డే రద్దు

image

ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో జరగాల్సిన అన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమాలను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు ఎవరూ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఏలూరుకు రావద్దని కోరారు.

Similar News

News December 6, 2025

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<>HAL<<>>), బెంగళూరు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 8 నుంచి 13 వరకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/

News December 6, 2025

ధర్మపురి: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు: ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టును, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావు పేట పోలింగ్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 6, 2025

తిరుపతిలో 10వ తేదీన ఇంటర్వ్యూలు

image

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో 10వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం పేర్కొంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు -04, న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్-01 మొత్తం 5 పోస్టులకు అవకాశం ఉంది. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్‌సైట్ చూడొచ్చు.