News August 1, 2024

ఏలూరులో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

ఏలూరులోని తూర్పులాకుల రైల్వే గేట్ సమీప రైల్వే పట్టాలపై రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్ఐ సైమన్ మాట్లాడుతూ.. మృతుడి వయస్సు 30 నుంచి 35ఏళ్ల లోపు ఉంటుందన్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.

Similar News

News December 1, 2025

మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్‌కు రావొద్దు’

image

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.

News December 1, 2025

భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.