News April 11, 2024
ఏలూరులో ‘లవ్ మౌళి’ మూవీ టీం సందడి

ఏలూరులోని SVC మహల్‌లో హీరో నవదీప్ సందడి చేశారు. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రచయిత అనంత శ్రీరామ్, చిత్ర నటీమణులు, తదితరులు ఉన్నారు.
Similar News
News February 11, 2026
తణుకు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో మృతి

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీర వెంకట సత్య తాతారావు (56) గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని ఈసీజీ తీయించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News February 11, 2026
యనమదుర్రు పెట్రోల్ బంక్‌లో జేసీ ఆకస్మిక తనిఖీ

యనమదుర్రులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతలు, ధరల ప్రదర్శనతో పాటు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
News February 11, 2026
మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

కాళ్ల(M) పెదమిరం క్యాంప్ కార్యాలయంలో శివరాత్రి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్‌ను బుధవారం కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన 2 ప్రముఖ పంచారామ క్షేత్రాలు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని ఏర్పాట్లు చేయాలన్నారు.


