News December 2, 2024

ఏలూరులో వివాహిత ఆత్మహత్య.. భర్తతో గొడవలే కారణం?

image

ఏలూరులో వివాహిత ప్రియాంక(25) <<14761231>>ఆత్మహత్యకు<<>> భర్తతో గొడవలే కారణమని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పని చేసే శ్రీకాంత్(30) అనే వ్యక్తి తనకు గతంలో పెళ్లయిందనే విషయాన్ని దాచి ప్రియాంకను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల ప్రియాంకకు తెలిసి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సైతం తెలిపింది. శనివారం రాత్రి కూడా గొడవ జరగ్గా నిన్న ఆమె ఉరి వేసుకుంది.

Similar News

News November 23, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News November 23, 2025

భీమవరం: 29న మెగా జాబ్ మేళా

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.