News February 12, 2025
ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2025
సంగారెడ్డి: భారీగా గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. 42 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 24, 2025
MHBD: ఎస్టీలకు 276 స్థానాలు!

జిల్లాలోని 18 మండలాల్లోని 482 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కులగణన ప్రకారం రోటేషన్ పద్ధతిలో కేటాయించారు. ఎస్టీలకు 276, ఎస్సీలకు 53, బీసీలకు 24, జనరల్‌కు 127 స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు.
News November 24, 2025
రైతు ఫ్యామిలీలో పుట్టి.. CJIగా ఎదిగి..

CJI జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లాలో రైతు ఫ్యామిలీలో పుట్టారు. హిసార్ జిల్లా కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టులో లాయర్‌గా కొనసాగారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన అంశాలు, ఎన్నికల సంస్కరణల వంటి కీలక కేసుల విచారణలో తనదైన ముద్ర వేశారు.


