News March 2, 2025
ఏలూరులో వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది. పట్టణంలోని ఫత్తేబాదకు చెందిన విద్యాసాగర్(38) స్థానికంగా ఒక ఫ్యాన్సీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు వైజాగ్లోని పుట్టింటికి వెళ్లారు. ఈ సమయంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారం కోసం అప్పులపాలు కావడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 23, 2025
వికారాబాద్: మార్వాడీల మాయాజాలం.. బంగారంతో మాయం.!

మార్వాడీల మాయాజాలం ప్రజల బంగారంతో మాయమైపోతున్నారు. స్థానిక నాయకుల అందండలతో మార్వాడీ వ్యాపారస్తులు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని పారిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుల్కచర్ల మండలంలో ఇప్పటివరకు మార్వాడీలు ప్రజలను నమ్మించి బంగారంతో ఉడాయించారు. మార్వాడీలు ప్రజలను తరుచూ మోసం చేసి పారిపోతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా ఉండటంతో మార్వాడీలు దోచుకుంటున్నారన్నారు.
News November 23, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం

డా. బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యయన కేంద్రంలో ఆదివారం డిగ్రీ 1, 3, 5 వ సెమిస్టర్, పి.జీ. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. అధ్యయన కేంద్రం వసతులు, నియమ నిబంధనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర – ఆర్డినేటర్ డా. కె. రంజిత, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.


