News March 24, 2024
ఏలూరులో సైబర్ మోసం.. రూ.92,650 ఫట్
బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఓ సైబర్ కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. ఇంద్రప్రస్థకు చెందిన బదులు వెంకటేశ్వరప్రసాద్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ అధికారినంటూ నమ్మబలికాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ వివరాలు తెలుసుకొని వెంకటేశ్వరప్రసాద్ ఖాతాలోంచి రూ.92,650 కాజేశాడు. వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 13, 2024
ఏలూరు జిల్లా బ్యాంకర్‌లకు కలెక్టర్ విజ్ఞప్తి
ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్‌లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం, ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా క్లైముల పరిష్కారంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు.
News September 13, 2024
ప.గో.: గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు
గాంధీ జయంతి సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి ఉమ్మడి ప.గో.జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ.. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజ్ డ్రాయింగ్ షీటుపై చిత్రం వేసి, స్కాన్ చేసి ispeducation@gmail.com మెయిల్‌కు ఈ నెల 21వ తేదీ లోపు పంపాలన్నారు.
News September 13, 2024
పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. పేరుపాలెంలోని మొలపర్రు కనకదుర్గా బీచ్‌కి వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ రహదారి మీదుగా ప్రయాణాలు నిలిపివేశామన్నారు. పర్యాటకులు ఈ విషయం గమనించి ఇతర మార్గాల్లో బీచ్‌కు వెళ్లాలని కోరారు.