News July 8, 2024
ఏలూరు: అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్న భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
పంట వివరాలను 5రోజుల్లో నివేదిక ఇవ్వాలి: జేసీ

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News October 30, 2025
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం: కలెక్టర్

జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం అందజేయాలన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, కంది పప్పు, వంట నూనె, ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు.
News October 30, 2025
పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. తాగునీరును క్లోరినేషన్ చేసిన తర్వాతనే విడుదల చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలను పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వినియోగించాలన్నారు.


