News July 8, 2024

ఏలూరు: అంగన్వాడీలో భోజనం చేసిన కలెక్టర్

image

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా పోషకాహారాన్ని అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్న భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో పాల్గొన్నారు.

Similar News

News October 12, 2024

ప.గో: బాలుడు చికిత్సకు సానుకులంగా స్పందించిన మంత్రి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెడ్లూం గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు సాత్విక్ వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చికిత్స పోందుతున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థతి అంతమాత్రంగానే ఉండటంతో సాయం కోసం సంబంధిత చికిత్స పత్రాలతో ట్విటర్‌లో మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించానని త్వరలోనే తన బృందం బాధిత కుటుంబాన్ని సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.

News October 11, 2024

భీమవరం: ‘విరాళాలు అందించడంలో జిల్లా మొదటి స్థానం’

image

విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో సేకరించిన విరాళాల మొత్తాన్ని రూ.1,17,66,351 లు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News October 11, 2024

నిడమర్రు: రూ.1.2కోట్లతో ధనలక్ష్మి అమ్మవారు అలంకరణ

image

నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పు వెలమ పేటలో వెలసిన దుర్గమ్మను శుక్రవారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.02 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, 140 కాసుల బంగారు నగలతో నిర్వహకులు విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి దేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.