News February 6, 2025
ఏలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. నేరానికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులు కాగా ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు చెందిన నేరస్థులుగా గుర్తించారు. పలు కేసులలో నిందితులన్నారు.
Similar News
News March 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.
News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
News March 26, 2025
సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.