News March 2, 2025
ఏలూరు: అపరాధ రుసుంలతో రూ.1.05 కోట్లు

ఏలూరు జిల్లాలోని ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులపై నమోదైన 3091 కేసుల ద్వారా రూ. 1.05 కోట్ల అపరాధ రుసుం వచ్చినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో హెల్మెట్ లేనివి 905, ట్రిపుల్ డ్రైవింగ్ 31, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 356, భీమా లేవిని291, ఫిట్నెస్ లేనివి143, టాక్స్ చెల్లించని వాహనాలపై 132 కేసులు ఉన్నాయన్నారు.1202 ఇతర కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News November 21, 2025
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MA (ELS/ELT/ఇంగ్లిష్), PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించి ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://uohyd.ac.in/
News November 21, 2025
VIRAL: సముద్రంలో ఒంటరిగా 483 రోజులు!

సముద్రంలో ఒంటరిగా ఒక్క రోజు గడపడమే గగనం. అలాంటిది జోస్ సాల్వడార్ అనే మత్స్యకారుడు 483 రోజులు ఒంటరిగా గడిపిన ఘటనను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2012లో మెక్సికో తీరం నుంచి పడవలో బయలుదేరిన ఆయన తుఫానులో చిక్కుకుని 438 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో గడిపారు. పచ్చి చేపలు, పక్షులు, వర్షపు నీరును తాగుతూ మనుగడ సాగించారు. బతకాలనే ఆశ బలంగా ఉంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఆయన నిరూపించారు.


