News December 3, 2024

ఏలూరు: అమ్మాయిని మోసగించిన వ్యక్తికి పదేళ్ల జైలు

image

ఆకివీడు మండలం గుమ్ములూరు చెందిన గండికోట తరుణ్ అనే వ్యక్తి భీమవరం మండలం సీసలి గ్రామానికి చెందిన యువతని ప్రేమ పేరుతో శారీరకంగా కలిసి పెళ్లికి నిరాకరించడంతో 2022 మే10న భీమవరం టూ టౌన్‌లో కేసు నమోదు అయిందని అడిషనల్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విన్న వాదనలు విన్న ఏలూరు మహిళా కోర్టు జడ్జ్ రాజేశ్వరి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని చెప్పారు.

Similar News

News October 27, 2025

పేరుపాలెం బీచ్‌కు నో ఎంట్రీ

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఎస్.ఐ. జి. వాసు తెలిపారు. సోమ, మంగళ, బుధవారాలు (మూడు రోజులు) బీచ్‌కు పర్యాటకులు, యాత్రికులు రావద్దని, తుఫాను కారణంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

News October 27, 2025

ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

News October 26, 2025

ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.