News January 27, 2025
ఏలూరు: అయ్యో పాపం..!

ఓ చిన్నారి ఎంతో వేదన అనుభవించి చనిపోయాడు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. మండవల్లి మండలం భైరవపట్నంలో శుక్రవారం రాత్రి గ్యాస్ సిలిండర్లు పేలి 9 గుడిసెలు <<15251500>>దగ్ధమయ్యాయి. <<>>ఈ ఘటనలో దుబ్బా వంశీ, అన్ను కుమారుడు విక్కీ(3) తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు కోలుకోలేక ఆదివారం కన్నుమూశాడు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ఈ ఎన్నికలు మార్పునకు నాంది కావాలి..!

గ్రామ పంచాయతీ ఎన్నికలు బాధ్యతలతో కూడినవి. అభివృద్ధి పేరుతో అప్పుల్లో కూరుకుపోయిన సర్పంచ్లు అనేకం. ఓటుకు నోటు ఇస్తే నిజాయతీ నాయకులు ఎదగరు. అభ్యర్థులు డబ్బులు, మద్యం పంచే చెడు పద్ధతులను మానుకోవాలి. ఓటర్లు కూడా డబ్బు కోసం ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారు. విలువలున్న వ్యక్తులనే ఎన్నుకుంటేనే గ్రామాల్లో నిజమైన మార్పు సాధ్యం. 2025 ఎన్నికలు మార్పునకు నాంది కావాలి.. ఓ పల్లె ఓటరా ఆలోచించు..!
News December 5, 2025
బంగారం ధరలు మరింత పైకి: WGC

వచ్చే ఏడాది కూడా పసిడి జోరు కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయుల నుంచి 15-30% పెరగవచ్చని చెప్పింది. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యాంకులు బంగారాన్ని కొంటుండటం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ రేట్లు 53% పెరిగాయి. అయితే US దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తే ధరలు 5-20% దిగి రావచ్చని WGC పేర్కొంది.
News December 5, 2025
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ మహేష్ కుమార్ రిక్వెస్ట్

ఏలూరు-జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రధాన రహదారిని జాతీయ ప్రధాన రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఢిల్లీలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణా భారీగా జరుగుతుంటుందని ఎంపీ తెలిపారు.


