News March 30, 2025
ఏలూరు: ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు

తల్లిదండ్రుల మందలించారని మనస్తాపం చెందిన టెన్త్ విద్యార్థిని(15) శుక్రవారం సాయంత్రం ఏలూరు కొత్త బస్టాండ్‌కు వచ్చి ఒంటరిగా కూర్చుంది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వచ్చిన బాలికను హిజ్రాలు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో డ్రైవర్ ప్రభాకర్ రాజుపై ఏలూరు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News October 18, 2025
తిరుపతి: పండుగ వేళ దోచేస్తున్నారు..!

దీపావళి నేపథ్యంలో తమిళనాడు, తెలంగాణ, కర్నాటక నుంచి తిరుపతికి ప్రైవేట్ బస్సుల ఛార్జీలకు అమాంతం రెక్కలొచ్చాయి. బెంగళూరు నుంచి వారాంతంలో సీటర్ రూ.600, స్లీపర్ రూ.1000 ఉండగా ఇప్పుడు ఆ ధరలు ఏకంగా రూ.1-2 వేల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఛార్జీలు భరించలేక కొందరు బైకులపై సొంతూర్లకు చేరుకుంటున్నారు.
News October 18, 2025
డిమాండ్లు తీరుస్తాం… వైద్యులు విధుల్లో చేరాలి: ప్రభుత్వం

AP: PHCల వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సూచించారు. PG మెడికల్ ఇన్‌సర్వీస్ కోటాను ఈఏడాది అన్ని కోర్సుల్లో కలిపి 20% అమలుకు GO ఇస్తామని వారితో చర్చల్లో వెల్లడించారు. ట్రైబల్ అలవెన్సు తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే PGలో 15% కోటా 3ఏళ్లు ఇవ్వాలని సంఘం నేతలు కోరగా దీనిపై ప్రభుత్వం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు.
News October 18, 2025
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.