News September 15, 2024

ఏలూరు: ఆన్‌లైన్‌లో మోసం.. డబ్బు రికవరీ

image

సైబర్ నేరాల్లో మోసపోయిన ఇద్దరికి న్యాయం జరిగింది. జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా పోస్టులు చూసి ఆన్‌లైన్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని అనుకుంది. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రూ.90 వేల పెట్టుబడి పెట్టింది. ఏలూరు త్రీటౌన్ స్టేషన్ పరిధిలో మరోవ్యక్తి రూ.1.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ 1930కు ఫిర్యాదుచేయగా పోలీసులు ఆ నగదు రికవరీ చేసి అందించారు.

Similar News

News November 20, 2025

బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

image

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 20, 2025

తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

image

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్‌ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.