News March 21, 2025
ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
Similar News
News March 24, 2025
PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.
News March 24, 2025
వనపర్తి: పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షకు 99.79 శాతం హాజరు

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 10వతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని వనపర్తి డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల సరళిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ పరీక్షకు 6,844 మంది విద్యార్థులకు 6,830మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని 99.79 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News March 24, 2025
తిరుమల వెంకన్న సేవలో శిరూరు మఠం పీఠాధిపతి

ఉడుపి శ్రీ శిరూరు మఠం 31వ పీఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామిజీ తమ శిశు బృందంతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్ద ఆలయ పేస్కర్ రామకృష్ణ, అర్చకులు స్వామికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలో స్వామీజీకి తీర్థప్రసాదాలను అందజేశారు.