News March 11, 2025
ఏలూరు: ఇంటర్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. జిల్లాలో మొత్తం 19,237 మంది విద్యార్థులు ఉండగా 18,050 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 778 ఒకేషనల్ విద్యార్థులు 409 మంది గైర్హాజరు అయినట్టు యోహాను తెలిపారు.
Similar News
News March 22, 2025
జూలూరుపాడు: ‘ఉపాధి కూలీలకు రూ.600 ఇవ్వాలి’

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం కింద రూ.600 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బానోతు ధర్మ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో ఉపాధి పని ప్రదేశాలను సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు మజ్జిగ, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News March 22, 2025
NGKL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ ఉపకార వేతనాల కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి పీవీ శ్రావణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆర్థిక సహాయం పొందడానికి ఈ పాస్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్ తదితర దేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
News March 22, 2025
ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.