News May 10, 2024
ఏలూరు: ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోం’

ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
Similar News
News February 8, 2025
నరసాపురం: ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

నరసాపురంలోని మాధవాయిపాలెం – సఖినేటిపల్లి రేవును శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు పోలీస్ వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ తెలిపారు.
News February 7, 2025
మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!

ఫైళ్ల క్లియరెన్స్‌పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
News February 7, 2025
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు