News March 2, 2025
ఏలూరు: ‘ఈ నెల 3న పకడ్బందీగా ఓట్ల లెక్కింపు’

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉదయం 6 గంటలకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 23, 2025
హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
News March 23, 2025
చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.
News March 23, 2025
ఎన్టీఆర్: ఆ నిర్ణయంతో వేలాది మందికి చేకూరనున్న లబ్ధి

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్(RTF) కింద రూ.600కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో మరో రూ.400కోట్లు విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన Xలో హెచ్చరించారు.