News August 18, 2024
ఏలూరు: ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు: MP

ధవళేశ్వరంలోని పోలవరం కుడికాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్దం ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News November 3, 2025
నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


