News January 30, 2025

ఏలూరు: ఎన్నికల కోడ్ కూసింది..  

image

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గురువారం అమలులోకి వచ్చింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఫ్లేక్సీలు తొలగించి, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్నారు. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం తదితర గ్రామాలలో రాజకీయ నాయకుల ఫ్లేక్సీల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రోడ్లపై గుంపులుగా తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 28, 2025

SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.

News October 28, 2025

‘మొంథా’ తుపాన్.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న రెండు రోజుల్లో జిల్లాపై ‘మొంథా’ తుపాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి లైన్ డిపార్ట్‌మెంట్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News October 28, 2025

మంచిర్యాల: అంగన్‌వాడీ కేంద్రాలు సాగేదెలా..?

image

మంచిర్యాల జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా వాటిని ఉన్నతాధికారులు ఇంతవరకు భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా ఖాళీ ఏర్పడిన కేంద్రాల్లో టీచర్లకు బీఎల్ఓ వంటి ఇతర బాధ్యతలు అప్పజెప్పడంతో తమపై అదనపు భారం పడుతుందని టీచర్లు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా దీనిపై స్పందించి ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులని వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.