News November 7, 2024

ఏలూరు: ఎన్నికల నియమావళి అమలుకు బృందాలు ఏర్పాటు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, మండల స్ధాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. 43 ప్రత్యేక వీడియో బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 11, 2025

మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

image

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News December 11, 2025

భీమవరం: ‘స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలి’

image

స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే ఏపీ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి ఏర్పాటైందని
ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా శేషగిరిరావు అన్నారు. గురువారం భీమవరంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో మన వాటా 2 శాతం మాత్రమే ఉందని, రానున్న కాలంలో 10 శాతానికి పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

News December 11, 2025

యూత్ హాస్టల్స్ కోరల్ జూబిలీ సావనీర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరల్ జూబిలీ సావనీర్‌ను కలక్టరేట్‌లో గురువారం కలెక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. భీమవరం యూనిట్ దక్షిణ భారత దేశంలో 2వ అతిపెద్ద యూనిట్‌గా అభివృద్ధి చేసినందుకు కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెక్కింగ్, రాప్టింగ్, హైకింగ్, పారా గ్రైండింగ్, రాఖ్ క్లైమ్బింగ్ వంటి అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని యూనిట్ ఛైర్మన్ మట్లపూడి సత్యనారాయణ కలెక్టర్‌కు వివరించారు.