News March 19, 2024
ఏలూరు: ఎన్ని విగ్రహాలకు ముసుగులేశారంటే ..!
ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. 883 వాల్‌రైటింగ్స్, 5,717 పోస్టర్లు, 5,634 బ్యానర్లు, 2,140 హోర్డింగ్స్ మొత్తం 14,374 తొలగించడం జరిగిందని అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేతలు, పార్టీలకు సంబంధించి.. 2,697 విగ్రహాలకు ముసుగుతో పాటు ప్రైవేట్ ప్రదేశాలలో ఉన్న 558 వాల్ రైటింగ్స్, 3,778 పోస్టర్లు, 2,981 బ్యానర్లు, 1,480 హోర్డింగ్స్ మొత్తం కలిసి 8,797 తొలగించామన్నారు.
Similar News
News September 18, 2024
మంత్రి లోకేష్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గన్ని
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, నాయకులు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2024
ప.గో.: చీపురు పట్టిన కేంద్ర మంత్రి, కలెక్టర్
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉన్నారు. అంతా కలిసి చెత్త ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేశారు.
News September 17, 2024
న్యాయం చేయమనాలంటే సిగ్గుగా ఉంది: RRR
వైసీపీ హయాంలో తనపై దాడి చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కాదంబరీ జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని, అలానే తనకు కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుక్కోవాలంటే సిగ్గుగా ఉందన్నారు.