News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రి సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11 పరిశీలన, ఫిబ్రవరి 13 ఉపసంహరణ, ఫిబ్రవరి 27 పోలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News November 19, 2025
కడప: నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు

పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా మంగళవారం వచ్చిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
News November 19, 2025
హిడ్మా ఎన్కౌంటర్లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్గఢ్లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.
News November 19, 2025
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు..!

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో కన్నపేగు బంధాన్నే తెంచుకుంటున్నారు. ఇటీవల కోరుట్లకు చెందిన మహిళ ఈర్ష్యతో సొంత మరిది బిడ్డను గొంతు నులిమి చంపిన ఘటన మరువకముందే KNR వావిలాలపల్లిలో కన్నకూతురినే గొంతు నులిమి కడతేర్చిన తండ్రి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు ఘటనలు వెలుగుచూశాయి. డబ్బుల కోసం వేధిస్తున్న భర్తను హత్య చేసిన ఘటన JGTL(D) మల్లాపూర్ మం. దామ్రాజ్పల్లిలో ఆదివారం జరిగింది.


