News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు

ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు. 20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్‌లు అందాయన్నారు.
Similar News
News February 18, 2025
బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.
News February 18, 2025
KMR: టీచరే కీచకుడిగా మారాడు

గాంధారి మండలంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. SI ఆంజనేయులు వివరాలిలా.. మండలంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ అదే పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఫోన్లో చెబుతానని తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకర మెసేజ్‌లు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.