News July 27, 2024
ఏలూరు: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

కుక్కునూరు మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిని సమీప బంధువు మడకం వెంకటేశ్ (24) గోదావరి వరద చూపిస్తానని ట్రాక్టర్పై తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో GCC భవనం వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి వద్ద దింపేశాడు. ఆమె ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా విషయం బయటపడింది. ఈ మేరకు వెంకటేశ్ను అరెస్ట్ చేసి కుక్కునూరు SI రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 23, 2025
ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 23, 2025
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్అండ్బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.
News December 23, 2025
భీమవరం: రబీ సాగుపై అధికారులతో జేసీ సమీక్ష

జిల్లాలో రబీ సాగుకు సంబంధించి ఎరువుల లభ్యతపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆర్.ఎస్.కేలు, సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద రబీకి సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడీఏలు, ఎంఏఓలు, ఆర్.ఎస్.కే సిబ్బంది పాల్గొన్నారు.


