News April 25, 2024

ఏలూరు: ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన: JC

image

దెందులూరు అసెంబ్లీ పరిధిలో 5వ రోజు బుధవారం ఏడుగురు అభ్యర్థులు తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి బుధవారం వెల్లడించారు. కాగా ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.

Similar News

News December 15, 2025

సామాన్యుల సమస్యల పట్ల అలసత్వం వద్దు: SP

image

పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గరగపర్రులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టంలో ఆయన 11 అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

News December 15, 2025

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు పొట్టి శ్రీరాములు: కలెక్టర్

image

ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవారు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు అయిన శ్రీరాములు ఆదర్శనీయులు, చిరస్మరణీయులని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

News December 15, 2025

ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

image

ఇంధ‌నాన్ని పొదుపు చేయ‌డం ద్వారా భావిత‌రాల‌కు వెలుగు నిద్దామ‌ని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.