News October 16, 2024

ఏలూరు: ‘ఒకటో తేదీనే నిత్యావసర సరుకుల పంపిణీ’

image

జిల్లాలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నిత్యవసర వస్తువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పామాయిల్, సన్ ఫ్లవర్ తక్కువ ధరతో అందించే 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధరలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

Similar News

News October 20, 2025

భీమవరం: నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ కోరారు.

News October 20, 2025

పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News October 19, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

image

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్‌వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.