News March 7, 2025
ఏలూరు: ఓ మంచి ఆలోచన..!

పక్షుల దాహార్తిని తీర్చడానికి పలువురు వివిధ రకాల పద్ధతులను ఆచరిస్తున్నారు. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బండివారి గూడెంలో వనసంరక్షణ సమితి సభ్యుడు, ఏలూరు జిల్లా రానా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ జాకీర్ హుస్సేన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. నిరుపయోగంగా ఉండే పాత్రలను సేకరించి పక్షులు తిరిగే ప్రదేశాల్లో చెట్లకు వేలాడదీసి నీరు పోశారు. మీరూ ఇలా ట్రై చేయండి.
Similar News
News March 24, 2025
ఖమ్మం: జోష్ పెంచిన బీఆర్ఎస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. BRSలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో BRS ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల తరువాత BRSనేతలు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీ అధినేత ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్మీట్లు పెట్టి అధికార పార్టీకి కౌంటర్లు ఇస్తోంది.
News March 24, 2025
WGL: ప్రారంభమైన మార్కెట్.. రూ.7 వేలు దాటిన ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా పత్తి ధరలు వచ్చింది. అయితే ధర మాత్రం గత వారం లాగే రూ.7 వేల మార్కు దాటింది. గత వారం మొదట్లో రూ.7,100 పలికిన క్వింటా పత్తి ధర.. వారం చివరి నాటికి రూ.7,010కి పడిపోయింది. నేడు (సోమవారం) పత్తి ధర రూ.7,030కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.