News March 30, 2024

ఏలూరు: కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) శనివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 5, 2025

ఆకివీడు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

image

ఆకివీడు సర్కిల్ పరిధిలో నగలు, మోటార్ సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, రూ.17 లక్షల 20వేలు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన బైరే వీరస్వామి, మహాదేవపట్నం గ్రామానికి చెందిన బలిరెడ్డి వరలక్ష్మి అనే మహిళను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి వివరాలను వెల్లడించారు.

News February 5, 2025

భీమవరం: ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..కలెక్టర్

image

గుర్రపు డెక్క నుంచి నారను తీసి బహుళ ప్రయోజనాలకు వినియోగించేలా గ్రామీణ్ ఫౌండేషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ కలెక్టర్‌లో ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమై గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రాజెక్టుపై చర్చించారు. గుర్రపు డెక్కన్ డెక్కన్ వేట రూ .5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.

News February 5, 2025

ప.గో: నులిపురుగుల నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ 

image

ఈనెల 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలో ఫిబ్రవరి 10న అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.

error: Content is protected !!