News March 10, 2025

ఏలూరు: కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం 

image

ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రీ సెల్వీ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సోమవారం వరకు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండలాల పరిధిలో ఈ కార్యక్రమం రద్దు చేశారు. కోడ్ ముగియడంతో ఈ సోమవారం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయిలో యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Similar News

News February 23, 2026

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

image

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష‌ ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.

News February 23, 2026

పోలవరం జిల్లాలో వార్డుల విభజన ప్రక్రియ షురూ

image

పోలవరం జిల్లాలో స్థానిక ఎన్నికల సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో వార్డుల విభజన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 186 పంచాయతీలున్నాయన్నారు. మార్చి 9న తుది ఓటర్లు జాబితా విడుదల చేయడానికి కృషి జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలతో సర్పంచుల పదవి కాలం ముగుస్తుందని, టెన్త్ పరీక్షలు తరువాత ఎన్నికలు జరిగే ఉందన్నారు.

News February 23, 2026

సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐలో రేపు జాబ్ మేళా

image

ఏలూరు సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈనెల 24 (మంగళవారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు టెన్త్ నుండి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులని ప్రిన్సిపల్ భూషణం తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.