News March 10, 2025
ఏలూరు: కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రీ సెల్వీ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సోమవారం వరకు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండలాల పరిధిలో ఈ కార్యక్రమం రద్దు చేశారు. కోడ్ ముగియడంతో ఈ సోమవారం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయిలో యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Similar News
News February 15, 2026
NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 15, 2026
ASF: MLAగా తండ్రి.. ఛైర్‌పర్సన్‌గా తల్లి, కౌన్సిలర్‌గా కొడుకు

కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు 17 ఓల్డ్ కాలనీ నుంచి కావేటి విజయ్ కౌన్సిలర్‌గా విజయం సాధించాడు. ఆయన తండ్రి కావేటి సమ్మయ్య MLAగా, ఆయన తల్లి సాయిలీల SKZR మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మద్దతుతో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తల్లిదండ్రుల మార్గంలో నడుస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ప్రకటించారు.
News February 15, 2026
VMLD: ప్రత్యేక ఆకర్షణగా శివార్చన కార్యక్రమాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధానంలో మూడు రోజులపాటు శివార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి రోజు శనివారం ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శిస్తూ అందరిని మెప్పిస్తున్నారు. నృత్యాల ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తి భావంతో భక్తులు తిలకిస్తున్నారు.


